సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం సాయంత్రం భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు గారి సోదరులు మంతెన నరసింహరాజు కుమార్తె వివాహ వేడుకలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో పాటు పలువురు కూటమి పార్టీల నేతలు ప్రజా ప్రతినిధులు హాజరు కాగా వారిలో ప్రత్యేక ఆకర్షణగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆగమనం నిలచింది. ఆయన పంక్షన్ హాలులో అందరిని హుషారుగా పలకరిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ని మరింత ఉత్సహంతో ఆయన భుజంఫై తన చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని మాట్లాడటం మీడియాకు ప్రత్యక ఆకర్షణగా నిలచింది. (కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ అధినేత జగన్ దగ్గరకు రఘురామ వెళ్లి మాట్లాడి ఎవరు ఊహించని షాక్ ఘటనతో పోలిస్తే ఇది చాల సహజమే.. ) రఘురామా.. రూటే సపరేట్.. ఇది శుభవేడుకలో పేర్ని నానితో సంభాషణ మర్యాద పూర్వక కలయికగానే చూడాలి మరి.. పార్టీలు వేరు అయ్యిన ఇద్దరు మంచి ‘మాట’ కారులే.. వేడుకకు వచ్చినవారు ఆసక్తిగాగమనించారు మరి.
