సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ను తొలగింపుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పీఎంజీకేఏవై) లో భారీగా అనర్హులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం సెర్వే లో తేలింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303 లబ్ధిదారుల కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కేవైసీ పూర్తి చేసి,కేంద్రం సమగ్ర సర్వే నిర్వహించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో 15.7 శాతం మంది అనర్హులు ఉన్నట్లు బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 39.5 శాతం అనర్హులు, త్రిపురలో 39.2 శాతం, తమిళనాడులో 38.7 శాతం, మేఘాలయలో 28.5 శాతం మంది అనర్హులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం అయ్యింది.
