సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో చైర్మెన్ మరియు 52 వార్డులకు ( ఇప్పటికే 4 వార్డులు కౌన్సెలర్స్ ఏకగ్రీవం అయినవీ మినహాయిస్తే.. చైర్మెన్ కు మాత్రం ఆ వార్డులలో మరో ఓటు పోలింగ్ ఉంటుంది) ఎన్నికలు నిర్వహిస్తున్న వేళా భీమవరం మునిసిపల్ మరియు ఎన్నికల కమిషనర్ రామచంద్ర రెడ్డి పర్యవేక్షణ లో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవలసిన బ్యాలట్ బాక్స్ లు ఇతర ఎన్నికల సరంజామాను క్షుణంగా పరిశీలించి వాటిని ఆయా బూట్ లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ప్రక్క భీమవరం పట్టణంతో పాటు గ్రామస్థాయి ఎన్నికలలో ల విధులు నిర్వహించనున్న ఉద్యోగులకు వివిధ మండలాలలో గ్రామా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో, శిక్షణకు హాజరయ్యే ఉద్యోగులు నుండి పోస్టల్ బ్యాలెట్ తీసుకొనే ప్రక్రియ నిన్న సోమవారం ప్రారంభమయింది. అయితే పలువురు ఉద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని, నేడు కూడా అనగా 24.11.2026న నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమ సమయాన్ని మధ్యాహ్నం 3.00 గంటల వరకు పొడిగించడం జరిగింది. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *