సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామివార్ల దేవస్థానంలో కార్తీక మాసం లో నేడు, పవిత్ర కార్తిక పౌర్ణమి కావడం తో వేలాది భక్తులు పోట్టెత్తిపోయారు. అందులోను శ్రీ స్వామివారు ‘స్కంద పురాణం’ ప్రకారం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ట కావడం ప్రపంచంలో చంద్రునివలె పక్షం రోజులలో రంగులు మార్చుకొనే ఏకైక శివుడు కావడం తో భక్తులు దూరప్రాంతాల నుండి పలు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు వస్తున్నారు. నేటి 14వ రోజు తెల్లవారు జాము 3గంటల నుండి స్వామివారికి మహాన్యాస పూర్వక పంచామృత రుద్రాభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. మహిళల దీపారాధన వెలుగులతో చంద్ర పుష్కరిణి శోభాయమానంగా మారింది. భారీ క్యూ లైన్ లలో వేగంగా భక్తులు దర్శనం చేసుకొని భారీ అన్నసమారాధన లో కూడా స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. గత 14రోజు సోమవారం సుమారు 40,000 మంది భక్తులు విచ్చేయగా సాయంత్రం గం 5-00 గంటల వరకు దర్శనముల ద్వారా రూ 4,42,266 /-రూపాయలు,లడ్డు ప్రసాదం విక్రయం వలన రూ. 41,760 /-రూపాయలు వెరశి 4,84,026/-రూపాయలు ఆదాయం లభించింది మరియు శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ 1,38,594/-రూపాయలు ఆదాయం లభించింది. భక్తులకు ఏర్పాట్లను దేవాలయ చైర్మెన్ చింతలపాటి బంగార్రాజు మరియు ఇఓ ఆకుల కొండలరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు. పర్యవేక్షిస్తున్నారు.
