సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి సమీపంలో ఆంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగి పురాణ ప్రాశస్యం కలిగి ఉన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంను ప్రోక్రేయిన్ లతో కూల్చివేత, శ్రీ సీతారామ ఆంజనేయ విగ్రహాల ఆర్చిని పోక్రెయిన్ లాగివేయడం, దానికి అక్కడే అడ్డుకొంటు నిరసన తెలియజేస్తూ.. వైసీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కూల్చివేసిన శిధిలాలు వద్ద కూర్చున్న తాజా వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. పవిత్ర హిందూ ఆలయం కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. “సనాతన ధర్మాన్ని కాపాడటమంటే మీ ప్రభుత్వం నిర్వచించే విధానం ఇదేనా?” సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని మీ స్వలాభం కోసం బుల్డోజర్లతో కూల్చివేత దృశ్యాలు తనను తీవ్రంగా కలచి వేశాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తిరుమలలోని చారిత్రాత్మక వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత మొదలుకొని, గత కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాలను నేలమట్టం చేయడం, అలాగే బద్వేలులోని కాశీ నాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెదక్కుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం సాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
