సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, IPS తాజగా ఒక ప్రకటన విడుదల చేసారు. దానిలో… రేపు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగనున్న భీమవరం, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, తణుకు పట్టణలలో మునిసిపల్ ఎన్నికలు మరియు మొదటి విడుత గ్రామా పంచాయతీ, ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 4మునిసిపాలిటీలు కోసం మొత్తం 373 మంది పోలీసు సిబ్బందిని కేటాయించామని, మొత్తం 183 పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 355 పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 435 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం మోహరించామని శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా వీటిలో 15 అత్యంత సమస్యాత్మక, 81 సమస్యాత్మక, 269 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *