సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ 2వ విడుత మున్సిపల్ ఎన్నికలులో భాగంగా పట్టణ ప్రజలతో కలసి ఇటీవల విలీన గ్రామాల ప్రజలు కూడా తమ ఓటు హక్కును మొత్తం 52 వార్డులలో వినియోగించు కొంటున్నారు. పట్టణంలో నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన ఓటింగ్ ఉదయం 10 గంటల నుండి బాగా పుంజుకొంది. వృద్దులు చక్కగా తమ ఓటు హక్కును వినియోగిన్చుకొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకే దాదాపు 50 శాతం పైగా ఓటింగ్ పూర్తీ అయినట్లు సమాచారం మొత్తానికి 70 శాతం ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. కొన్ని వార్డుల వద్ద స్వల్ప వివాదాలు జరిగినప్పటికీ అవి సద్దుమణిగాయి. త్వరగా ఓటింగ్ జరగడానికి ఓటర్లు ను కౌంటర్ ఫాయిల్స్ చింపే ముందు సంతకానికి బదులు వేలిముద్ర తీసుకోవడం ఫై కొందరు అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రధాన పక్షాలు పోరు కంటే స్వాతంత్ర అభ్యర్థులు ఉన్న వార్డులలోనే పోటీ కాస్త హోరాహోరీగా, కనపడుతున్న సూచనలు కనపడుతున్నాయి. కౌన్సిల్ కు చైర్మెన్ కు విడి విడి ఓటింగ్ జరుగుతున్నా నేపథ్యంలో ఓటర్లు కు 2 ఓట్లు ఉన్న క్రమంగా ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? అన్న కాస్త మీమాంస అభ్యర్థులను కలవరపెడుతుంది. అయితే ఎన్నికలకు ‘చేయవలసిందంతా చేశాం’ అవతల పక్షం వాళ్ళు విటమిన్ M ఇవ్వలేక ముందే చేతులు ఎత్తేసారు ఏది ఏమైనా ‘వార్ వన్ సైడ్’ అనే ధీమా మరి కొందరి నేతలలో కనపడుతుంది. పోలీసులు మాత్రం ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తమ సేవలు అందిస్తున్నారు.
