సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పురపాలక సంఘల ఎన్నికల పోలింగ్ పూర్తీ అయ్యింది. నేటి సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి . మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యధికంగా సుమారు 80 శాతం పోలింగ్ నమోదు కాగా, నెల్లూరు జిల్లా గూడూరులో అత్యల్పంగా 55 శాతం పోలింగ్ జరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 ప్రధాన పట్టణాలలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భీమవరం పట్టణంలో మొత్తం 62.62 శాతం ఓటింగ్ పాలయ్యింది. మొత్తం 52 వార్డులకు కలపి 1,45,738 ఓట్లకు గాను 91,260 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మధ్యాహ్నం3 గంటల తరువాత పోలింగ్ శాతం బాగా మందగించింది. ఇక జిల్లా వ్యాప్తంగా తణుకు, తాడేపల్లి గూడెం లలో 60 శాతం మించి ఓట్లు పోలవ్వగా పాలకొల్లు లో మాత్రం అత్యధికంగా 75 శాతం వరకు ఓట్లు పోలయినట్లు తెలుస్తుంది.
