సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శనివారం ఉదయం ఆకివీడు నగర పంచాయితీలోని స్థానిక డైలీ మార్కెట్ వద్ద గంగానమ్మ కోడు ప్రక్షాళన పనులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు నూతన మునిసిపల్ షాపుల నిర్మాణానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు శంకుస్థాపన చేశారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ శరవేగంగా పూర్తీ చేస్తామని ఇకపై ఈ ప్రాంతంలో ప్రజలకు ఇకపై, పారిశుధ్య ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భముగా స్థానిక ప్రజలు వ్యాపారుల సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సంబంధిత అధికారులతో మాట్లాడలాడతానని వారికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
