సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, జై హింద్, శ్రీ ఆంజనేయం, హనుమాన్ జంక్షన్, వంటి ఎన్నో అల్ టైం సూపర్ హిట్ సినిమాలతో పాటు ఇటీవల ‘బ్లాస్ట్’ వంటి సూపర్ హిట్ అందించిన సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన 175వ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయి లో నిర్మించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన ఓ భారీ బహుభాషా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు అయోధ్యలో నేడు, శనివారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో ప్రారంభ పూజలు నిర్వహించిన తొలి చిత్రంగా ఇది నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా కోసం అర్జున్ సర్జా దర్శకుడిగా, నటుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రిటైర్డ్ భారత సైనికాధికారి మేజర్ విజయ్ భార్గవ్ అందించిన స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కర్తవ్యం, త్యాగం, ధైర్యం, జాతీయ భద్రత వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగనుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను రహస్యంగా ఉంచారు. తొలుత ప్రధానంగా హిందీలో రూపొందించి, మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశ 81వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2027 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు
