సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాడేరు గ్రామంలో నేడు, గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడు చెన్నమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ .. అన్నిధానాల కెల్లా రక్తదానం గొప్పదని, పార్టీ కార్యకర్తలు, నాయకులు పవన్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమలతో నిర్వహించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ధరణి వాలంటరీ బ్లాండ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బండి రమేష్, కత్తుల నీలేంద్ర, వానపల్లి సూరిబాబు, ఆకుల శ్రీను, విక్రమ్, పెదబాబు, శ్రీకృష్ణ, సన్ని రాజు, తేజ, నరేష్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
