సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం కేంద్రంగా కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో అంత కొత్త కొత్తగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 40 మంది హోం గార్డులకు బదిలీలు ఆదేశాలు వచ్చాయి. జీతంలో కాకపోయిన పోలీసులతో పాటు దాదాపు సమానంగా పనిచేసే హోమ్ గార్డ్ లకు బదిలీ అంటే చాల ఇబ్బందికర పరిణామమే.. అయితే తాజా ఆదేశాల మేరకు రెండేళ్ల పాటు ఒకే పోలీస్‌స్టేషన్ పరిధిలో పనిచేసిన హోం గార్డులకు వారు ప్రస్తుతం పని చేస్తున్న స్థానం నుంచి హోంగార్డులను సుమారు 50 కిలోమీటర్లు దూరం బదిలీ చేశారు. ఇప్పటికే విద్య సంస్థలు ప్రారంభమై వాటిలో చదువుకొంటున్న వారి పిల్లల పరిస్థితి కొంత ఇబ్బంది కరమే. వీరి బదిలీ అయినంత వేగంగా విద్యార్థులు మధ్యస్తంగా విద్య సంస్థలు మారలేరు.. అదో పెద్ద తతంగం.. ఏది ఏమైనా బదిలీ అయిన 40 మంది హోమ్ గార్డులు పైవారి ఆదేశాల పాలనకు సిద్ధం అవుతున్నారు.
