సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు, శుక్రవారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్‌.. పలు కార్యక్రమాల్లో​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం తీవ్ర అలసట కు గురైన విశ్వరూప్ తన చేయి లాగుతుందని, అస్వస్థతగా ఉందని ప్రక్కన ఉన్న నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరం లోని బొల్లినేని ఆసుపత్రికికి తీసుకు వెళ్లారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్‌ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనను ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *