సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త డాక్ట‌ర్ వై.య‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు స్థానిక వైసిపి నేతలు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పుష్ప మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో వేసిన టెంట్లలో పెదమహిళలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉచితంగా చీరల పంపిణి నిర్వహించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి, స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు తాను ఎమ్మెల్యే గా పనిచెయ్యడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని, ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ హయాంలో కూడా తాను ఎమ్మెల్యే గా ఉంటూ మరింతగా ప్రజా సంక్షేమానికి కృషి చేసే భాగ్యం దక్కిందని ఆనందం వ్యక్తం చేసారు. అనంతరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నందు వై.య‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *