సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మారుతి సెంటర్ లో అనేక దశాబ్దాలుగా వేంచేసి ఉన్న మహిమానిత శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి గుడిలో నేడు, శనివారం ఉదయం 6 గంటల నుండి భక్తులచే “అఖండ హరే రామ నామ సప్తహం”ప్రారంభించారు. ఈ సప్తాహం వచ్చే శనివారం ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిర్వహిస్తామని, కావున భక్తులు కుటుంబ సమేతంగా హాజరయి శ్రీ సీతారామ,లక్ష్మణ, శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆసిస్సులు పొందాలని ఒక ప్రకటనలో శ్రీ శ్రీ శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పరుచూరి నాగేశ్వర రావు మరియు ధర్మకర్తలు కోరారు.
