సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వినాయక చవితి ఉత్సవాలు వాడవాడలా ఉత్సవ పందిళ్ళలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వినాయక పందిళ్ళ అలంకారములలో నిర్వాహకులు పోటీ పడుతున్నారు. దీనిలో భాగంగా గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దశావతార గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత శుక్రవారం గణనాథుడిని లక్ష్మి దేవికి ప్రతి రూపం అయిన డబ్బు తో అంటే ఏకంగా కోటీ అరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీలక్ష్మీగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు. ఫై చిత్రంలో చూడవచ్చు..
