సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురపాలక సంఘం కార్యాలయం సమావేశ మందిరంలో నేడు, శనివారం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల కరెస్పాండెంట్లతో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ.. , ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు తప్పనిసరిగా పేద విద్యార్థులకు కల్పించాలని సీట్లు భర్తీకి సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో పారదర్శకంగా పొందుపరచాలని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని ఆదేశించారు. చైల్డ్ ఇన్ఫో నందు విద్యార్థుల నమోదు, టీసీలు ఇచ్చుట, పాఠ్యపుస్తకాలు పంపిణీ వివరాలు ఆన్ లైన్ లో ఇండెంట్ చేయడంలో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో SCERT పాఠ్యపుస్తకాలతో విద్యాబోధన చేయాలని ఆమె అన్నారు. 25 శాతం అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న ఫీజు రియంబర్స్మెంట్ వివరాలు తెలియజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశ వివరాలు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా సీట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టరు పి ప్రశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. వి. రమణ, మున్సిపల్ కమిషనర్ యస్.శివ రామ కృష్ణ, భీమవరం ఉప విద్యాశాఖ అధికారి డి. శ్రీరామ్, మండల విద్యాశాఖ అధికారి బి. వినాయకుడు, తదితరులు పాల్గొన్నారు.
