సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా అల్లు అర్జున్ (బన్నీ )మళ్లీ వార్తలో నిలిచాడు. గతం నుండి పలుమారులు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో,ఆయన అభిమానుల విషయంలో బన్నీ ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది అన్నది అందరికి తెలిసిందే.. అయితే తాజాగా బన్నీ ప్రవర్తించిన తీరుకి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు. ఇండస్ర్టీలో ఉండే ప్రతి ఒక్క హీరో పవర్‌ స్టార్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పారు. అయితే అల్లు అర్జున్‌ నుంచి స్పందన మాత్రం లేదు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కూడా లేదు. కనీసం ‘నేను ఫోన్ చేసి విషెష్ చెప్పాను’ అని కూడా బన్నీ నుండి రాలేదు.. ఇదే మరోసారి ‘చెప్పను బ్రదర్‌’ వివాదాన్ని బయటకి తీసింది. తన తాతగారైన అల్లు రామలింగయ్య , అల్లు అరవింద్ వారసుడిగా మాట్లాడటానికి ఇష్టపడే అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ హీరో అని అనిపించుకోవడం ఇష్టం లేదు అని మాత్రం ఫిల్మ్ వర్గాల టాక్.. అలా వైకుంఠపురం, పుష్ప వంటి బంపర్ హిట్ సినిమాలతో తనను ఫ్రూఫ్ చేసుకొన్న బన్నీ..మరి ఇలా చేయడం వల్ల తనని ఇష్టపడుతున్న కొంతమంది మెగా అభిమానులకు దూరం అవుతాడు అనేది కూడా నిజం. అవునన్నా కాదన్నా, మెగా స్టార్ చిరంజీవి మేనియా అల్లు అర్జున్ ఎదుగుదలకు పెద్ద ఊతం ఇచ్చిన మాట వాస్తవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *