సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల్లో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారని, బూత్‌ల స్వాధీనానికి ప్రయత్నిస్తు న్నారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నాటికీ ఓటర్ కార్డు తో ఆధార్ కార్డు అనుసంధానం పూర్తీ చెయ్యాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ మన ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 25 శాతం కూడా పూర్తీ కాలేదని సమాచారం.. వివరాలలోకి వెళ్ళితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజక వర్గాలతోపాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన కైకలూరు, నూజివీడు నియోజక వర్గాలతో కలిపి ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఈ 17 నియోజక వర్గాల్లో దాదాపు 36.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు వీరిలో తొమ్మిది లక్షల పైగా ఓటర్లు కార్డు లను మాత్రమే ఆధార్ లకు లింక్ చేయగలిగారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కాస్తంత మెరుగైన పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఆదివారం ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు అధికారులు వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఓటర్లంతా తమ ఓటు గుర్తింపు కార్డుతో దగ్గరలోని పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్ళి అనుసంధానం చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీని నిర్వహణ తీరుపై అన్ని వైసిపి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు నేతలు వంద కళ్ళు వేసి గమనిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *