సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజక వర్గాలతోపాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన కైకలూరు, నూజివీడు నియోజక వర్గాలతో కలిపి మొత్తం 17 నియోజకవర్గాలలో ఎన్నికల అధికారులు ఓటర్ ఐడి కార్డు తో ఆధార్ అనుసంధామ్ చేసే పక్రియ చేపట్టారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయవద్దని, ఎక్కడైనా అనుమానం వస్తే తక్షణం అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యా దులు చేయాలని అన్ని పార్టీలు తమ క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చి అప్రమత్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ ఏ నియోజకవర్గాలలో ఎంత మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారో? తెలుసుకోవాలి కదా!.. ఓటర్ల సంఖ్య వివరాలలోకి వెళ్ళితే.. జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గం లో 2,49,401 ఓటర్లు ఉన్నారు. ఆచంట లో 1,76,584 పాలకొల్లులో 1,93,676 నరసాపురంలో 1,64,656 ఉండి లో 2,23,604 తణుకులో 2,35,795 తాడేపల్లిగూడెంలో 2,10,360, కొవ్వూరు లో (ఎస్సీ) 1,76,091 నిడదవోలులో 2,04,760 ఉన్నారు. ఇక ఏలూరు జిల్లా కేంద్రంలో 2,24,563 ఓటర్లు ఉంగుటూరులో 2,01,171 దెందులూరులో 2,22,559 గోపాలపురం(ఎస్సీ) 2,31,582పోలవరం(ఎస్టీ) 2,41,659చింతలపూడి(ఎస్సీ) 2,60,558నూజివీడు 2,34,550కైకలూరు 1,99,980 మొత్తం ఓటర్లు 36,51,549 ఉన్నారు.
