సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడిగా దశాబ్దం క్రిందట బిందాస్, ప్రయాణం, వేదం, కరెంటు తీగ వంటి వరుస ఒక మోస్తరు హిట్స్ తో హీరోగా రాణించిన యంగ్‌ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్‌ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏవైనా 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్‌ పరంగానూ వరుస ప్లాప్ సినిమాలతో మనోజ్ బాగా వెనుకబడిపోయారు. అయితే తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజకీయనేతలుగా సుపరిచితులయిన భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్‌ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫ‌ల‌మండిలోని వినాయ‌క విగ్ర‌హాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *