సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద నేడు, బుధవారం ఒక ప్రవేటు స్కూల్ బస్సు ను వెనుక నుంచి మరో స్కూల్ బస్సు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పిల్లలను తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బస్ డ్రైవర్‌పై ఆగ్రహంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాదనకు దిగారు. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెంకు చెందిన సెంట్ జోసెఫ్ స్కూల్ బస్‌ను జంగారెడ్డిగూడెంకు చెందిన మరో స్కూల్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్ అద్దాలు పగిలిపోయాయి. . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఏది ఏమైనా ప్రెవేటు స్కూల్ బస్సులకు అనుభవజ్ఞులయిన డ్రైవర్స్ నడుపుతున్నారో లేదో ? జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారులు తనిఖీ చెయ్యవలసి ఉంది.
