సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురైన పిప్పళ్ళ శ్రీనివాసరావు అనే జన సేన కార్యకర్తకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన 50 వేల రూపాయల చెక్కును ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ , కొటికలపూడి గోవిందరావు గారు ఆయన కార్యాలయంలో పిప్పళ్ళ శ్రీనివాసరావు కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 100 ఏళ్ళు నిండిన రాజకీయ పార్టీలు, 25 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. కానీ ఒక్క రోజు అధికారంలో లేని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసైనికులకు అండగా నిలుస్తోంది, అని ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కారేపల్లి శాంతి ప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి, చనమల్ల చంద్రశేఖర్, గుండా రామకృష్ణ , ఎంపీటీసీ గోడి ఆదిలక్ష్మి, భీమవరం మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అడ్డాల రాము, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, తదితర నేతలు పాల్గొన్నారు.
