సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ భేటీ సీఎం జగన్ అడ్జక్షతన సుదీర్ఘంగా జరిగింది. తదుపరి కేబినెట్ నిర్ణయాలు ప్రకటించారు. తాజగా మొత్తం 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కీలకంగా గ్రీన్ ఎనర్జీలో 81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. తద్వారా 21 వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం, వైఎస్ఆర్ చేయూతకు ,భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదించింది. ఇక కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ విడి విడిగా సమావేశమయ్యారు. టీడీపీ మద్దతుగా దుష్టచతుష్టయం చేస్తున్న విమర్శలపై ఎందుకు గట్టిగా స్పందించట్లేదని కొందరు మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నట్లు వార్త సమాచారం.ప్రజలకు ఎన్నో సంక్షేమపథకాలు ఇస్తున్నాము.. మనం తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ భయపడాలి? ప్రతిమీటింగ్‌లో నేనే వారిని టార్గెట్ చేయాలా? వారు అంత దారుణమైన అభియోగాలు మన ఫై వేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారంటూ’ మంత్రులపై జగన్ మండిపడ్డారు. ఇకపై ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని మెతక ధోరణి పనిచేయదని మంత్రులను ఆదేశించారు. తప్పుడు ఆరోపణలపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని, అవినీతి రహితంగా సమర్ధవంతంగా మీ శాఖ పనితీరు ఉండాలని లేదంటే మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. అని తెలుస్తుంది.
