సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పెరిగిన ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా 4 ప్రత్యేక రైళ్లనినడపను న్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి ప్రకటించారు. ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07153 నరసాపురం నుండి -యశ్వంత్‌పూర్‌ వెళ్లే రైలు ఈనెల 9, 11 తేదీల్లో భీమవరం మీదుగా మధ్యాహ్నం 3.40 బయలుదేరి రాత్రి 7.50కి గుంటూరు చేరుకొంటుంది. తదుపరి రోజు ఉదయం 10-50 కి యస్వంతపూర్ చేరుకొంటుంది.నెంబరు.07154 యశ్వం త్‌పూర్‌-నరసాపురం రైలు ఈనెల 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8-30కు నరసాపురం వస్తుంది. వరుసగా 13 రోజులు పాటు హైదరాబాద్ నుండి ఇంటర్‌సిటీ రైళ్ల రద్దు చేస్తున్నారు. .నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కాజీపేట మార్గంలో రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌-గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ రైళ్లని రద్దు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *