సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం లో రోడ్లు నిర్మాణాలు, ఇటీవల సుందరీకరణ పేరుతొ పట్టణంలో ఎక్కడ చుసిన నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ రోడ్డు ప్రక్క నిర్మాణాలు రోడ్లపై గ్రావెల్ , ఇసుక జారిపోయి వాహనదారులను ఇబ్బందులు పెడుతుంటే.. మరో ప్రక్క స్థానిక విజయలక్ష్మి థియేటర్స్ వద్ద టీపీ గూడెం వెళ్లే రోడ్డు రైల్వే అండర్ బ్రీజ్ భారీ నిర్మాణం కారణంగా తరుచుగా మూసివేసే ఉంటుంది. అటువైపు టీపీ గూడెం వైపు ప్రధాన రహదారి వైపు వేలాది విద్యార్థులు అటు మెంటే వారి తోట, ఇటు విష్ణు ,SR ఇతర విద్యాసంస్థలు కు వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మెంటే వారి తోట నుండి ఇప్పటికే కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన 3 రైల్వే అండర్ టర్నల్స్ సిద్ధం అయినప్పటికీ వాటిలో 2 టర్నల్స్ ప్రతి రోజు వర్షానికి 3 అడుగుల నీటితో నిండిపోతున్నాయి. లేదా సుదీర్ఘముగా సాగుతున్న షెడ్డు పనుల దృష్ట్యా , లేక టర్నల్ ముందు డ్రైన్స్ రిపేరు కారణంగా వాటిని కూడా తరచూ మూసివేస్తున్నారు . ఉన్నంత లో బుధవారం మార్కెట్ వద్ద వేసిన రైల్వే టర్నల్ ఒక్కేటే అన్ని హంగులతో ప్రస్తుతం ప్రయోజనకారిగా ఉంది. అయితే అన్ని వాహనాలు అటువైపు నుండే వెళ్ళటం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. గత సాయంత్రం వాహనదారుల కష్టాలకు తోడు అన్నట్లు ఒక స్కూల్ బస్సు టర్నల్ లో ఆగిపోయింది. ఇక చూసుకోండి.. ఎక్కడో సుమారు 2 కిమీ దూరమునుండి టర్నల్ లో నుండి వెళదామని వర్షం లో తడుచుకొంటూ అక్కడ కు వచ్చిన వాహనదారులకు గంట పాటు ట్రాఫిక్ జామ్ కనిపించింది.. ఇక ఒక్కటే మార్గం.. 6 కిమీ చుట్టూ తిరిగి మార్కెట్ యార్డ్ నుండి రావడం..పైగా బై పాస్ లో తరుచు రైల్వే గేటు పడుతూనే ఉంటుంది.. ఇక వాహనదారుల అదృష్టం బట్టి ప్రయాణం ఉంటుంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు, జిల్లా అధికారులు , ఆర్ అండ్ బి అధికారులు సమన్వయంగా పనిచేసి గత 4 నెలలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు నుండి త్వరగా విముక్తి కలిగే దిశగా అన్ని టర్నల్స్ ను పూర్తీ స్థాయిలో త్వరితంగా అందుబాటులోకి తీసుకొనిరావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *