సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన ఎందరో సామాన్య వ్యక్తులు దేశవ్యాప్తంగా , అంతర్జాతీయంగా ప్రముఖులుగా పలు రంగాలలో రాణిస్తున్నారు. ఇక సినిమా రంగానికైతే సంహాభాగం భీమవరం వారిదే.. పాన్ ఇండియా స్టార్ హీరో, ప్రభాస్, రాంగోపాల్ వర్మ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్వీ కృష్ణరెడ్డి వంటి టాప్ డైరెక్టర్స్ ,సునీల్, ఎంఎస్ నారాయణ,రాజారవీంద్ర, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ మాలాశ్రీ, భీమవరం టాకీస్ బ్యానేర్ ఫై 100 లో బడ్జెట్ సినిమాలు నిర్మించిన రామసత్యనారాయణ …వంటి ఎందరో ఇక్కడి వారే.. ఇక టివి 9 ఛానెల్ లో చాల కాలంగా ముఖ్యంగా హీరో విజయదేవరకొండ మేనరిజం తో మొదలై అందరి హీరోలను మిమిక్రి చెయ్యగల ‘ కొండబాబు’ గా పాపులర్ అయిన సుంకర సుధీర్ కూడా భీమవరం యువకుడే. స్థానిక 15వ వార్డులోని అమ్మిరాజు తోటకు చెందినవాడు. టీవీ తెరపై ఎస్ జె సూర్య గా పేరుపెట్టుకొని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే బిగ్ బాస్ 6 సీజన్ లో ఇటీవల ప్రతి రోజు అందరిని అలరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *