సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కోండ్రుపోలు జాతీయ రహదారి వద్ద నేడు, శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రక్క వర్షం మరోప్రక్క ఎదురుగ వస్తున్నా బైక్ ను తప్పించబోయిన కోడిగుడ్ల లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన గుడ్ల లారీ తణుకు నుంచి నూజివీడు వెళ్తుండగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్సు లో బాధితులను తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. .
