సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కాలం వైపరీత్యం కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వర్ష కాలంలో ఎప్పుడు వర్షాలు కురుస్తోయో ఎదురుచూసే పరిస్థితులు నెలకొనయ్యాయి. వరుస అల్ప పీడనాల పుణ్యమా అని కోస్తా ఆంధ్రాలో ఎదో ఇటీవల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మినహా తెలంగాణాలో కూడా ఓ మోస్తరు వర్షాలే పడుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ మరో శుభవార్త తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో.. కోస్తా ఆంధ్ర లో 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. వచ్చే మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. .
