సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము ఆవరణలో ఉన్న ఉప ఆలయం శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం నందు గణపతి 11 రోజుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నేడు, శనివారం జరిగిన అఖండ సమారాధనను భీమవరం శాసన సభ్యులు గ్రంది శ్రీనివాసు తనయులు గ్రంది రవితేజ ఉదయం గం.11.00 ప్రారంభించారు. విశేషంగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తదుపరి, శ్రీ స్వామి వారి విగ్రహ నిమజ్జ కార్యక్రమము మధ్యాహ్నం గం. 3.00 లకు రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు ప్రారంభించారు. వీరితో ఆలయ ప్రదాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రజీ , తోపాటుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *