సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో కురుస్తున్న వర్షాలు నేడు, ఆదివారం దూకుడు బాగా తగ్గింది. గత 11 రాత్రులు శ్రీ వినాయక చవితి పందిళ్ళలో కొలువు తీరి ఉన్న గణేష్ ప్రతిమలను నిన్న శనివారం సాయంత్రం మరియు నేడు, ఆదివారం మధ్యాహ్నం వాడవాడలా మహా ప్రసాద వితరణలు నిర్వహించి నిమజ్జనాలకు మహిళల మంగళహారతులతో,యువత ఉత్సహంగా నృత్యాలతో, తీన్మార్ శబ్దాలతో గణేష్ ప్రతిమలను పంటకాలువలకు వాహనాలలో తరలించడానికి వాతావరణం సహకరించింది. స్థానిక చేపల మార్కెట్ సెంటర్, రెస్ట్ హౌస్ రోడ్ ,సుంకరపడ్డాయ వీధి, గునుపూడి, నాచువారి సెంటర్, నరహరశెట్టి వారి వీధి, చినరంగాని పాలెం తదితర ప్రాంతాలలో సందడి నెలకొంది. నేటితో దాదాపు పట్టణంలో వినాయక చవితి వేడుకలు దాదాపు ముగిసినేట్లే..చాల అరుదుగా కొందరు 18 రోజుల వరకు విగ్రహాలను నిలబెట్టారు. ( ఫై చిత్రం స్థానిక 20వ వార్డు నరహరశెట్టి వారి వీధిలో నిమజ్జనం కు తరలిస్తున్న శ్రీ గణేష్ ప్రతిమ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *