సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తిస్తుందని, పదవులు దక్కిన వారు బాధ్యతగా పని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, పార్టీకి అంకితభావంతో పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. నేడు, సోమవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మైనార్టీ వెల్ఫేర్ ప్రధానమంత్రి 15 పాయింట్ల ప్రోగ్రాం పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులుగా తనను నియామకం చేసినందుకు అస్ముక్ లాల్ జైన్ భీమవరంలోని తమ సంఘ సభ్యులతో కలిసి స్థానిక క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వారిని అభినందించారు.
