సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: నేడు, బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా లోని బరేరి నల్లాసమీపంలో మినీ బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 11 మంది మృతి చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. బస్సు సావ్జియాన్ నుంచి మండికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. మినీ బస్ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మినీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
