సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: తాజగా దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు చేసింది. వాటిలో అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం పెద్ద షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు.. ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేసింది. తెలంగాణ నుంచి రిజిష్టర్ అయిన ఏకంగా 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని, ఆంధ్రా ప్రదేశ్ నుండి 5 పార్టీలను ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఎప్పుడు మీడియాలో ఎదో ఒకటి చేసి మంచి స్వింగ్ లో ఉండే కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే యాక్టివ్‌గాలేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కొందరు వ్యాపారవేత్తలు,ధనవంతులు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది
