సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలుచోట్ల రైల్వే గేటు అడ్డంకులు తొలగిస్తూ పలుచోట్ల కోట్లాది రూపాయలు రైల్వే శాఖ నిదులల్తో రైల్వే అండర్ టర్నల్స్ ను నిర్మాణములు పూర్తీ అయ్యినప్పటికీ, కొన్ని టర్నల్స్ ప్రస్తుతం వినియోగంలోకి వచ్చినప్పటి స్వల్ప పనులు మిగిలిపోవడంతో ఈ వర్షాకాలంలో నీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో తనను కలసిన రైల్వే ఉన్నత అధికారుల తో నిర్మాణపనులపై సమీక్షా జరిపారు… అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పట్నంలో జరుగుతున్న అండర్ టన్నెల్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, షెడ్డు లు నిర్మాణం పూర్తీ అవుతున్నాయని, టర్నల్ లో వర్షపు నీటిని గుర్తించే ఆధునిక సెన్సార్లు బిగించే పనికూడా ఉందని, ,అదే మాదిరిగా గరగపర్రు రోడ్డులో ఆధునిక టెక్నాలజీ తో భారీ స్థాయిలో త్వరితగతిన అండర్ టన్నెల్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలో ఆ భారీ టర్నల్ వాహనదారులకు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని , ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని, ఇక రానున్న రోజుల్లో బైపాస్ రోడ్డు రైల్వే గేట్ వద్ద, ఉండి రైల్వే గేట్ వద్ద, కొడవలి రైల్వే గేట్ వద్ద ఆర్ యు బి పనులకు రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేస్తుందని, ఇది రైల్వే అధికారుల దృష్టికి తెచ్చానని ప్రకటించారు. అన్నారు.ఈ సమావేశంలో ఆర్ వి ఎన్ ఎల్ మేనేజర్ శ్రీనివాసరావు, రైల్వే పిఎంసి కిషోర్, ఐ ఓ డబ్ల్యూ విజయ్, కోటేశ్వరరావు లు పాల్గొన్నారు.
