సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: శతమానం భవతి తరువాత ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నా మంచి నటుడు, యువ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఎంత మంచి కాంబినేషన్ లో చేసిన సినిమా నిలబడటం లేదు.. సీనియర్ నటి, అక్కినేని అమల ముఖ్య పాత్రలో శర్వానంద్ హీరోగా , రీతూ వర్మ, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నటించిన ‘ఒకే ఒక జీవితం’ గత వారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి విభిన్న కదంశంతొ, మంచి పాజిటివ్‌ టాక్‌ వున్నా థియేటర్స్ వైపు ప్రేక్షకులు రావడం లేదు.. ఈ సినిమా టైటిల్ చాల సాదాగా ఉండటం, ఇదో విషాదభరితం అనుకోని యువత ఈ సినిమా వైపు రావడం లేదు. ఈ సినిమా నిర్వాహకులు సినిమా ప్రమోషన్ విషయంలో ఫెయిల్‌ అయ్యారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్‌ మీట్‌, సక్సెస్‌ మీట్‌లు తో సరిపెట్టారు. మంచి సినిమా అయినప్పటికీ శర్వానంద్‌ సినిమా అనగానే ఓటీటీలో చూడొచ్చు అని ప్రేక్షకుడు అనుకోవడమే. ఇంకా 400 కోట్ల భారీ సినిమా సినిమా బ్రహ్మాస్త్ర కూడా అదే రోజున విడుదల అవటం. ఆ సినిమాని రాజమౌళి భుజాన వేసుకొని ప్రమోషన్స్‌ చెయ్యడం వల్ల దానికి బాగా ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఒకే ఒక జీవితం సినిమా కలెక్షన్స్‌ పెరగాలంటే సెలబ్రెటీలు సహకారం తప్పనిసరి..లేకపోతె ఇక శర్వానంద్ ఇక సింగిల్ హీరోగా విరామం తీసుకోవలసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *