సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో బియ్యం ధరలు గత 2 నెలలుగా బియ్యం రకాలు బట్టి ధరలు 7 నుండి 10 శాతం వరకు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో వరి సాగు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ధాన్యం దిగుబడి భారీగా తగ్గనుంది. దీంతో బియ్యం ధరలు పెరుగుతాయని అంచనా. వినియోగదారుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఏడాది క్రితం క్వింటాలుకు రూ.3,047గా ఉన్న బియ్యం టోకు ధర సెప్టెంబరు 14నాటికి 10.7 శాతం పెరిగి రూ.3,357కి చేరింది. ఇదే సమయానికి రిటైల్ ధరలు రూ.34.85 నుంచి 9.4 శాతం పెరిగి రూ.38.15కు చేరింది. దేశంలోని మొత్తం బియ్యం ఉత్పత్తిలో 85శాతం వరకూ ఖరీఫ్ సీజన్లోనే వస్తుంది. ఈ సారి 6 నుంచి 7 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని ఆహార మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే ధరలపై ఎలాంటి భయాలూ అవసరం లేదని,వద్ద ప్రజా పంపిణీకి సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అంటుంది..
