సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: విభిన్న చిత్రాల యువ హీరోగా ఒక ఇమేజ్ ఏర్పరచుకొన్న ‘మేడ్ ఇన్ భీమవరం” శ్రీ విష్ణు హీరోగా ,ప్రదీప్ వర్మ దర్శకత్వం లో నిర్మించిన ‘అల్లూరి” సినిమాఈ నెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గత ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన హీరో శ్రీ విష్ణూ ను అభినందిస్తూ, నా మనస్సుకు దగ్గరయిన వారు చాల తక్కువ మంది ఉంటారు. కానీ హీరో శ్రీ విష్ణూ నాకు చాల దగ్గరయ్యాడు. అతని సినిమాలు అన్ని చూస్తాను.(సన్ అఫ్ సత్యమూర్తితో ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు కూడా) ఇండస్ట్రీలో పెద్ద సినిమాలతో పాటు,’అల్లూరి’ లాంటి చిన్న సినిమాలు కూడా ఆడాలి .. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక నా అభిమానుల విషయానికి వస్తే.. ‘ఎవరికైనా అభిమానులుంటారు. కానీ నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ.. ఐ లవ్ యూ’’ అని అల్లు అర్జున్ అంటూ నర్మగర్భంగా కాస్త మసాలా దట్టించి చేసిన వ్యాఖ్యలకు ఆ ప్రాంగణమంతా కేరింతలతో హోరెత్తిపోయింది. ఇటీవల’అల్లు” బ్రాండ్ అంటూ స్వంత ఇమేజ్ కోసం ప్రయతిస్తున్న అల్లు అర్జున్ వ్యాఖ్యలు చాల కాలం నుండి కాస్త తేడాగానే వినిపిస్తున్నాయి.. పుష్ప పాన్ ఇండియా హిట్ తో అల్లు అర్జున్ లో మరో కోణం ను మెగా అభిమానులు అర్ధం చేసుకొంటున్నారు..
