సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమాలలో మెగాస్టార్ , కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవి ముగియగానే దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చెయ్యలేదు. సినిమాలపైనే ద్రుష్టి పెట్డుటున్నారు. అలాంటిది ఆయన” గాడ్ ఫాదర్ లో పొలిటికల్ నేతగా కనిపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్‌లోగత మంగళవారం ఒక పొలిటికల్‌ పంచ్‌ వేశారు. ‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అనే డైలాగ్‌ని అభిమానులలో వదిలారు. ఇక చుడండి. ఏపీ బీజేపీ అడ్జక్షుడు సోము వీర్రాజు అయితే ఆయన కు బీజేపీ చేరితే మంచిదని మీడియా ముందు సలహా కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే స్వాందించింది . మెగాస్టార్‌ చిరంజీవిని కాంగ్రెస్ అధిష్టానం ఏపీసీసీ డెలిగేట్‌గా ఎన్నుకుంది. ఆయన ఈ పదవిలో 2027 వరకు ఉంటారు. ఇందుకు సంబంధించి చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ నేడు, బుధవారం ఐడీకార్డు ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఏపీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి ఉన్నారు. ఒక ప్రక్క రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో మరి చిరంజీవి ఏపీసీసీ డెలిగేట్‌గా బాధ్యతను మోస్తారో లేక తిరస్కరిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *