సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చాల కాలంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఏమాత్రం ఇప్పటివరకు పనులు కదలని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
