సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సాక్షాతూ దుర్గ దేవి కనకవర్షం కురిపించి అక్కడే కొలువైనట్లు పురాణాలలో పేర్కొన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా విశేషంగా తరలివచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు, వివరాలు విషయానికి వస్తే.. 26-09-22 సోమవారం – స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి అవతారంలో , 27న మంగళవారం – శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి – 28న బుధవారం – శ్రీ గాయత్రీ దేవి – 29న గురువారం -శ్రీ అన్నపూర్ణ దేవి – 30న శుక్రవారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి – .01-10-22 శనివారం – షష్ఠి – శ్రీ మహాలక్ష్మీ దేవి -.2న ఆదివారం – శ్రీ సరస్వతు దేవి -3న సోమవారం — శ్రీ దుర్గా దేవి – 4న మంగళవారం -శ్రీమహిషాసురమర్ధిని దేవి – 05-10-22న బుధవారం -విజయ దశమి – శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో శ్రీ అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు.
