సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును జగన్ సర్కార్ తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌ను యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాము.. .. “NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అని తన అభిప్రాయాన్ని గౌరవ ప్రదంగా తెలిపారు. అయితే మరింత ఘాటుగా స్వాందిస్తే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఫై కొందరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ప్రక్క బాబాయి బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే మరో ప్రక్క తనకు పిల్లనిచ్చిన మామయ్య నార్నె శ్రీనివాసరావు అధికార వైసిపి లో ఎంపీగా కొనసాగుతున్నవేళ్ళ.. రాజకీయ వివాదాలకు దూరంగా జూనియర్ తనదయిన శైలి అలవరచుకోవడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *