సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కృష్ణ జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్ .. అదే విజయవాడ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేసి తన తండ్రి వై ఎస్ పేరు పెట్టడం ఫై తెలుగు రాష్ట్రాల లో చర్చ జరుగుతుంది. దీనిపై సీఎం జగన్ సోదరి వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలో మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కరెక్ట్ కాదన్నారు. పేరు మార్చడం వల్ల యూనివర్సిటీ ప్రాధాన్యత పోతుందన్నారు. గతంలో ఏవో కారణాల చేత యూనివర్సిటీకి ఒక పేరు పెట్టారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కోపేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రెఫర్ చేస్తున్నారో తెలియక విద్యార్థులకు ,ప్రజల్లో ఆయోమయం నెలకొంటుందని, దీనిని పురనరాలోచించాలని వైఎస్ షర్మిల చెప్పారు.
