సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా లో కూడా దేశవ్యాప్తంగా తెలుగువారి పాన్‌ ఇండియా హవా ఏ మాత్రం తగ్గలేదు. హిందీలో డైరెక్టుగా 10 కి పైగా సినిమాలు చేసిన సీనియర్ హీరో నాగార్జున ఈమధ్య ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించారు. అది సంచలన విజయం నమోదు చేసింది. హిందీలో కూడా శివ, ద్రోహి, ఖుదా గావా, క్రిమినల్ వంటి మంచి హిట్స్ ఉన్న నాగార్జున క్రేజ్ మరోసారి బ్రహ్మస్త్ర సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది. ఇదే అదనుగా ఇప్పుడు నాగార్జున తన కొత్త సినిమా ‘ది ఘోస్ట్‌’ తెలుగు తో పాటు హిందీలో కూడా విజయదశమి కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. నిజానికి ఈ సినిమాని కేవలం తెలుగుకే రిలీజ్ చేద్దామనుకొన్నారు. కానీ గరుడావెగా.. వంటి మంచి హిట్ ఇచ్చిన ప్రవీణ్ సత్తార్ దర్శకుడిగా ‘ది ఘోస్ట్‌’ మంచి టేకింగ్ అవుట్‌పుట్‌ చూశాక.. ‘ఘోస్ట్‌’ని హిందీలోనూ విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *