సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేడు, మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 3 రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కార్ కు ఆతృతను అడ్డుకొంటు… అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఆ పిటిషన్ పై వాదనలు ముగిసి, తీర్పు వెలువడే వరకు కూడా జగన్ మంత్రి వర్గానికి వేచి ఉండే ఓపిక లేదని విమర్శించారు. ఉత్తరాంద్ర కు చెందిన మంత్రులు గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, అప్పలరాజు, సంబంధం లేని స్పీకర్ తమ్మినేని లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. మంత్రిగా బొత్స సత్యనారాయణ చొరవ తీసుకొని ముఖ్యమంత్రికి చెప్పవచ్చునని, కానీ ఆయన కూడా వికేంద్రీకరణ ఉద్యమానికి మద్దతుగా తాము శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించలేమా?అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థపై, శాసన వ్యవస్థ దాడి చేస్తుందా? హైకోర్టు ఒకే రాజధాని అమరావతి అని చెప్పడం తప్పా? అని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు కు వ్యతిరేకంగా… వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడించడం, ప్రజాస్వామ్య వ్యవస్థ కి బ్లాక్ డే అని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *