సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, శనివారం స్థానిక కోర్ట్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 160 కేసులో పరిష్కరించినట్లు భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 3వ అదనపు జిల్లా జడ్జి N. నాగరాజు తెలిపారు. భీమవరం మండల న్యాయసేవాధికార ఆద్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భముగా నిర్వహించిన మీటింగ్ లో కక్షిదారులు పంతానికి పోకుండా రాజీ చేసుకోవడం ద్వారా సమయమ వృదాకాదు. కక్షిదారులు, న్యాయవాదులు సహకరిస్తేనే త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు. . ఈ అదాలత్ లో సివిల్ కేసులు 24, భీమవరం టౌన్, రూరల్, వీరవాసరం, ఉండి, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు పోలీస్ స్టేషన్ లకు సంభందించిన క్రిమినల్ కేసులు 105
మనోవర్తి కేసులు 3 చెక్ బౌన్స్ oకేసులు 26 బ్యాంక్ రికవరీ ప్రీ లిటీగషన్ కేసులు 2 మొత్తం..143 కేసులను ఉభయ పార్టీల కోరిక మేరకు రాజి చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు
రూ.43,13,000.00 లక్షలు సివిల్ కేసుల్లోను రూ.85,00,000/-చెక్ బౌన్స్ కేసుల్లో అవార్డులను జరీచేసుయున్నారు. ప్రత్యక్షంగాను మరియు బ్లూజీన్స్ ద్వారా నిర్వహించిన ఈ జాతీయ లోక్ అదాలత్ ను 4 బెంచ్ లుగా ఏర్పాటుచేశారు. న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్ T. రాజా వెంకటాద్రి ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి, D. సోని , 1వ అ. జూ. సివిల్ జడ్జి A. పవన్ కుమార్, 2వ అ. జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 1st క్లాస్ శ్రీ K. బాల కోటేశ్వరరావు మరియు గార్లు , న్యాయవాద సభ్యులుగా Ch. లింగ మూర్తి, N R P అమ్మిరాజు, T V J లక్ష్మణ్, T. లక్ష్మీ బెంచ్ సభ్యులుగా వ్యవహరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్ , కార్యదర్శి S. సత్యనారాయణ గారు పాల్గొన్నారు. పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ సాంబయ్య, మోహనరావు భీమవరం పోలీస్ అధికారులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *