సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుకు రేపు, గురువారం ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ సభ, భోజన సమారాధన కార్యక్రమాలకు మొగల్తూరు మండలంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజుకు అనుబంధంగా ఉండే ప్రతీ ఒక్కరు పాల్గొనాలని వారి కుటుంబసభ్యులు ఆహ్వానిస్తున్నారు. 60 వేల మంది పాల్గొంటారని అంచనా.. భారీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.వర్షాలు పడిన భోజనాలకు ఇబ్బందులు లేకుండా ప్రతిష్ఠమైన రేకులతో పండితులు వేస్తున్నారు. ఈ నెల 11న కృష్ణంరాజు హైదరాబాద్‌లో మృతి చెందారు. రేపు జరిగే సంస్మరణ సభకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు సినీ హీరో ప్రభాస్‌ హాజరవుతున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ప్రభాస్ మొగల్తూరు లోనే ఉంటారు. ఇక్కడకు అతి సమీపంలోని భీమవరం కేంద్రంగా ఆయన మిత్రులు, సన్నిహితులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 11న కృష్ణంరాజు హైదరాబాద్‌లో మృతి చెందారు. మొగల్తూరు గ్రామంలో రేపు రెబల్ స్టార్స్ అభిమానులు తో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, రాకపోకల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా … జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌ ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను పరిశీలించిబారికేడ్లతో పాటు పూర్తిస్థాయిలో పోలీస్‌ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. గత మంగళవారం కలెక్టర్‌ పి,ప్రశాంతి, సబ్‌కలెక్టర్‌ విష్ణుచరణ్‌, స్థానిక అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఆయా ప్రాంతాలను పరిశీలించారు.స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పర్యటించి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం ఉంటుందన్నారు. పెద్దాయన కార్యక్రమం కాబ్బటి హీరో ప్రభాస్ అభిమానులు సమన్వయం పాటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *