సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, సోమవారం శ్రీ అమ్మవారు పెద్ద పులి వాహనం ఎక్కిన శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు విశేషంగా కుంకుమ పూజలు, చండి హోమం జరిగాయి. నేడు, పలు సాంస్కృతిక ప్రదర్శనలు తో పాటు నేటి సాయంత్రం 7గంటలకు ఆలయ వేదికపై నాట్యమండలి వారి కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహిస్తారు.
