సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ దర్శకులలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న మణిరత్నం, చోళ రాజుల చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందించిన పోనియన్ సెల్వమ్ .. ‘పీఎస్ 1’ ఇటీవల విడుదలయి (తమిళనాడు మినహా మిగతా ప్రాంతాలలో కధ అర్ధం కాకపోయినా) ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే (నిన్న ఆదివారం వరకు )రూ.230 కోట్ల కలెక్షన్లు కొల్లగొటిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశాడు. ఈ మూవీ విడుదలైన మొదటి రోజే.. తమిళనాడులో రూ.25.86కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5.93కోట్లు, కర్ణాటకలో రూ.5కోట్లు, కేరళలో రూ.3.7కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి విదేశాలలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందుకే కేవలం మూడు రోజుల్లోనే 3.3 మిలియన్ డాలర్ల వసూళ్లని రాబట్టగలిగింది. దీంతో.. టేకింగ్ బాగున్నప్పటికీ ఎక్కువ చీకటి లో తీసిన సన్నివేశాలతో మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ చిత్రం నిజంగా ఈ కలెక్షన్ల లెక్కలు సాదించిందా ? అన్న విషయం మరో వారంలో తేలిపోతుంది. ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయి , త్రిష, కార్తి, జయం రవి, తదితరులు అపూర్వముగా నటించారు.
