సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కేంద్రంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలకు కేబుల్ టివి ప్రసారాలు అందించడంలో దిగ్గజంగా ఎదిగిన BCN (ది.భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్) ఆసియా ఖండంలోనే తొలిసారిగా BHEEM TVపేరుతో ఎటువంటి కేబుల్ వైర్లు లేకుండానే 4కె ఆర్డీకే లైనెక్స్ బేస్డ్ ఐ.పి.టివి బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ఈ రోజు విజయదశమికి తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా.. సంస్థ చైర్మన్ ఆర్. శ్రీనివాసరాజు, ఎండి ముదునూరి రాజగోపాలరాజు తెలిపారు. భీమవరంలోని BCN సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఫ్రాన్స్ దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ , ఇండియాలోని టాటా ఎలాక్సీ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బాక్స్ ని రూపొందించినట్లు చెప్పారు. ఈ బాక్స్ ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు తో పాటు, వైద్య, సమాచార రంగాలకు సంబంధించిన యావత్ పరిజ్ఞానం వినియోగదారుల ముంగిట్లో అందుబాటులోఉంటుందన్నారు. భీమ్ టీవీ బాక్స్ ద్వారా కస్టమర్ టు కస్టమర్ వీడియో కాలింగ్ సదుపాయం ఉందన్నారు. బీమ్ బాక్స్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉన్నప్రముఖ ఓటిటి యాప్ లతోపాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓటిటి యాప్ లు టివి ఛానెల్స్ ఒకే రిమోట్ ద్వారా సామాన్యులకు అందుబాటు రుసుముతో అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.ఈ బాక్స్ ఇండియా లో ఏ ప్రాంతములోకి మారినా వినియోగించుకోవచ్చును. అన్ని ఇంటర్నెట్ సర్వీసులలో కూడా ఇది పని చేయనున్నట్లు తెలిపారు. ఈ బాక్స్ అతి తక్కువ ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ స్పీడ్ తో అంటే కేవలం 5 ఎంబీ తో నూరు శాతం క్వాలిటీతో ప్రసారాలు వినియోగదారులకు అందుతాయన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఆర్.లోకేష్ వర్మ , మొగల్తూరు ఆర్.ఎమ్.ఎస్.ఓ. కాసాని రామకృష్ణ (ఫై చిత్రంలో మన సిగ్మా న్యూస్ ఆఫీస్ లో బీమ్ టివి ప్రసారాలు టెస్ట్ చేస్తున్న BCN చైర్మన్ శ్రీవాసరాజు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *